: వెంకయ్యనాయుడితో చిరకాల సాన్నిహిత్యం ఉంది: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్
ఎన్డీఏ తరపున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన వెంకయ్యనాయుడుని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అభినందించారు. ఈ రోజు ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, వెంకయ్యనాయుడితో తనకు చిరకాల సాన్నిహిత్యం ఉందని, ఈ పదవికి ఆయన అన్నివిధాలా యోగ్యుడైన వ్యక్తి అని అన్నారు. రాజకీయంగా ఎంతో అనుభవజ్ఞుడైన వెంకయ్యనాయుడు పార్టీలో లేకపోవడం లోటే అయినప్పటికీ, దేశ హితం కోరుకునే పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని, ఆయన అభ్యర్థిత్వంపై దేశ వ్యాప్తంగా కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.