: గోవాలో బీఫ్ కొరత వస్తే, పక్క రాష్ట్రాల నుంచి తెప్పించుకుందాం: సీఎం పారికర్
ఒకవేళ గోవా రాష్ట్రంలో బీఫ్ కు కొరత ఏర్పడితే, పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుందామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అన్నారు. గోవా అసెంబ్లీలో ఈ రోజు ఆయన మాట్లాడుతూ, గోవాలో బీఫ్ కు కొరత ఏర్పడదని తాను హామీ ఇస్తున్నానని అన్నారు. బెల్గామ్ లేదా ఇతర ప్రాంతాల నుంచి బీఫ్ ను దిగుమతి చేసుకునే అవకాశాలను తానేమీ రద్దు చేయలేదని అన్నారు. అయితే, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే బీఫ్ ను గుర్తింపు పొందిన వైద్యులు పరీక్షించి, నిర్ధారించాల్సి ఉంటుందని అన్నారు.