: కాలిన‌డ‌క భ‌క్తుల‌కు టీటీడీ శుభవార్త!


కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులకు శుభవార్త. ఇకపై నిత్యం 20 వేల దివ్యదర్శనం టోకెన్లను జారీ చేసేందుకు టీటీడీ నిర్ణయించింది. అన్నమయ్య భవన్ లో టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు ఈరోజు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అలిపిరి కాలినడక మార్గంలో వచ్చే వారి కోసం 14 వేలు, శ్రీవారి మెట్టు మార్గంలో వచ్చే భక్తుల కోసం 6 వేల దివ్యదర్శనం టోకెన్లను జారీ చేస్తామని చెప్పారు. వారాంతంలో వచ్చే కాలినడక భక్తులకు టోకెన్లు జారీ చేయడాన్ని కొనసాగిస్తామని చెప్పారు. నడకదారిన వచ్చే భక్తులకు శ్రీవారి దర్శనం త్వరగా కల్పించనున్నామని చెప్పారు. గదుల కేటాయింపులో ఇటీవల తీసుకు వచ్చిన విధానంతో భక్తులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.

  • Loading...

More Telugu News