: చైనా సరిహద్దు ప్రాంతాల్లో భారత్ రహదారి నిర్మాణాలు
భారత్, చైనా మధ్య 3,448 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉన్న విషయం తెలిసిందే. ఆ సరిహద్దుల్లో భారత్ 73 రహదారుల నిర్మాణం చేపడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు లోక్‌సభలో వివరించి చెప్పింది. వీటిల్లో 46 రహదారులను రక్షణ మంత్రిత్వ శాఖ, మరో 27 రహదారులను హోం మంత్రిత్వ శాఖ నిర్మిస్తోందని పేర్కొంది. 73 రహదారుల్లో ఇప్పటికి 30 రహదారులు పూర్తయ్యాయని, ఎత్తైన ప్రాంతాలు, అడవులు, ప్రకృతి విపత్తుల కారణంగా మిగతా రహదారులు వేయడంలో ఆలస్యం జరిగిందని పేర్కొన్నారు. వాటి నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు ఇప్పటికే ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశామని తెలిపింది.