: నాకు భూములు కబ్జా చేయాల్సిన అవసరమే లేదు: చంద్రబాబుతో ఎమ్మెల్యే పీలా గోవింద్
తనకు భూములు కబ్జా చేయాల్సిన అవసరమే లేదని సీఎం చంద్రబాబుతో అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ అన్నారు. చంద్రబాబును ఈరోజు ఆయన కలిశారు. తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలపై ఆయన వివరణ ఇచ్చుకున్నారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన తండ్రి తనకు చాలా ఆస్తులు ఇచ్చారని, వాటి వివరాలను చంద్రబాబుకు అందించానని చెప్పారు. ‘నేను ఎలాంటి తప్పు చేయలేదు, విచారణ జరపాలని కోరాను. నాపై వచ్చిన ఆరోపణల వెనుక మంత్రి అయ్యన్న హస్తం లేదు’ అని గోవింద్ చెప్పారు.