: సుదీర్ఘంగా కొనసాగుతున్న ఏపీ మంత్రివర్గ సమావేశం.. పలు అంశాలపై చర్చ
ఆంధ్రప్రదేశ్ నవ్య రాజధాని అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆధ్వర్యంలో సుదీర్ఘంగా ఈ భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా అమరావతిలో నిర్మించాలనుకుంటున్న శాశ్వత భవనాల అంశంపై చర్చిస్తున్నారు. శాశ్వత అసెంబ్లీ భవనం, ఇతర ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణం గురించి మంత్రులు తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. అలాగే పలు సంస్థలకు భూకేటాయింపుల అంశంపై కూడా చర్చలు జరుపుతున్నారు.