: మ‌ట‌న్‌ వండిపెట్టలేదని.. భార్యను చంపి, ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ భర్త


త‌మిళ‌నాడులోని పొన్నేరిలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. చికెన్ కూర చేయలేదని ఓ వ్య‌క్తి త‌న‌ భార్యను చంపి అనంత‌రం తానూ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళితే, ఎన్నూరు సునామీ కాలనీకి చెందిన మోహన్‌ (33) ఇంటికి ఆయ‌న‌ సోదరి వచ్చింది. దీంతో బ‌జారుకెళ్లి మటన్ తీసుకొచ్చిన మోహన్‌ తన భార్య సరళ(27)ను వండిపెట్ట‌మ‌ని చెప్పి త‌న ప‌నికి వెళ్లిపోయాడు. అయితే, సరళ మ‌ట‌న్ విషయం మరిచిపోయి త‌న ప‌ని తాను చేసుకుంది. రాత్రి ఇంటికి వచ్చిన మోహన్, మ‌ట‌న్ వండ‌లేద‌ని తెలుసుకుని భార్య‌తో గొడ‌వ‌కు దిగాడు. ఆవేశంతో ఊగిపోయి సరళ గొంతు నులమడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.

తర్వాత త‌న‌ను పోలీసులు అరెస్టు చేస్తార‌ని భయపడిన మోహన్‌ ఫ్యాన్‌కు ఊరి వేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. దీంతో వారి ముగ్గురు కుమార్తెలు మహాలక్ష్మి (9), అనుప్రియ (7), కావ్య (5) అనాథ‌లైపోయారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News