: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు అజిత్
ప్రముఖ దక్షిణాది నటుడు అజిత్ ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులకు ఆయన స్వాగతం పలికారు. వీఐపీ ప్రారంభ దర్శనంలో స్వామి వారిని అజిత్ దర్శించుకున్నాడు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. అజిత్ తో ఫొటోలు దిగేందుకు భక్తులు, ఆయన అభిమానులు ఆసక్తి చూపారు. కాగా, వచ్చే నెల 10న అజిత్ నటించిన చిత్రం ‘వివేగం’ విడుదల కానుంది. అజిత్ తన కొత్త సినిమా విడుదలకు ముందు తిరుమలకు వచ్చి స్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయతి. వివేగం చిత్రంలో అజిత్ సరసన కాజల్ కథానాయికగా నటించింది.