: లండన్‌లో విహరిస్తున్న సానియా, షోయబ్ జంట!
సానియా, షోయబ్ జంట ప్రస్తుతం లండన్ వీధుల్లో తమ హాలీడేను ఎంజాయ్ చేస్తున్నారు. వీరితో పాటు జహీర్‌ఖాన్ - సాగరిక, ఆశిశ్ నెహ్రా, అజహర్ మహ్మద్‌లు కూడా లండన్‌లోనే ఉన్నారు. వీరంతా కలిసి ఒక పెళ్లికి హాజరైనట్టు సమాచారం. వీరు లండన్లో చక్కర్లు కొడుతున్న ఫొటోలను సానియా, షోయబ్ తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇద్దరికీ ఖాళీ సమయం ఉండటంతో వీరు ఈ హాలీడే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. వింబుల్డన్‌లో మధ్యలోనే నిష్క్రమించిన సానియా సోమవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో నిలిచింది.