: స్నాప్‌డీల్‌ను చేజిక్కించుకోవ‌డానికి భారీ మొత్తం ఆఫ‌ర్ చేసిన ఫ్లిప్‌కార్ట్‌


ఆన్‌లైన్ కొనుగోళ్ల‌లో త‌న‌కు గ‌ట్టిపోటీనిస్తున్న స్నాప్‌డీల్‌ను చేజిక్కించుకోవ‌డానికి ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం ఫ్లిప్‌కార్ట్ బాగా ప్ర‌య‌త్నిస్తోంది. ఇందుకోసం 850 మిలియ‌న్ డాల‌ర్ల భారీ మొత్తాన్ని ఆఫ‌ర్ చేసింది. ఇందులో 650-700 డాల‌ర్ల‌ను వెంట‌నే చెల్లించేందుకు కూడా ఫ్లిప్‌కార్ట్‌ సిద్ధ‌ప‌డింది. ఈ ఆఫ‌ర్‌కు ఓకే చెప్ప‌డానికి స్నాప్‌డీల్ వారు మొగ్గు చూపుతున్న‌ట్లు స‌మాచారం. ఈ ఒప్పందంలో భాగంగా స్నాప్‌డీల్‌కు చెందిన ఈ-కామ‌ర్స్ బిజినెస్ మొత్తం ఫ్లిప్‌కార్ట్ సొంత‌మ‌వుతుంది. స్నాప్‌డీల్ వారి ఫ్రీఛార్జ్‌, వుల్క‌న్ ఎక్స్‌ప్రెస్‌లు ఈ ఒప్పందంలో భాగం కాదు. ఈ ఆఫ‌ర్ గురించి చ‌ర్చించేందుకు స్నాప్‌డీల్ యాజ‌మాన్యం త‌మ షేర్ హోల్డ‌ర్ల‌తో స‌మావేశం కానుంది.

  • Loading...

More Telugu News