: `హసీనా పార్కర్` సినిమా ట్రైలర్ విడుదల
ముంబై మాఫియా నేపథ్యంలో శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన `హసీనా పార్కర్` సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాకు అపూర్వ లాఖియా దర్శకత్వం వహించారు. ఇందులో హసీనా పార్కర్ సోదరుడు దావూద్ ఇబ్రహీంగా స్వయానా శ్రద్ధా కపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్ నటిస్తున్నారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే హసీనా పార్కర్గా శ్రద్ధా కపూర్ నటించి తాను ఇప్పటి వరకు కనిపించిన పక్కింటి అమ్మాయి పాత్రలకు భిన్నంగా కనిపిస్తోంది.
అలాగే సోదరుడు చేసిన నేరాలకు పోలీసులు తన కుటుంబానికి పెడుతున్న ఇబ్బందులను హసీనా ఎలా ఎదిరించింది? తన వాళ్లందరినీ కోల్పోయినపుడు ఎలా స్థైర్యంగా నిలబడి పోరాడిందనే విషయాలను ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ ట్రైలర్ను శ్రద్ధా కపూర్ తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసింది.