: మరో ముఖ్య ఉద్యోగిని కోల్పోయిన ఇన్ఫోసిస్
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న రితికా సూరి తన పదవికి రాజీనామా చేశారు. ఈమెను స్వయంగా సీఈఓ విశాల్ సిక్కా తనతో పాటు సాప్ కంపెనీ నుంచి తీసుకువచ్చారు. ఇన్ఫోసిస్‌లో ఇతర కంపెనీల విలీనాలు, స్వాధీనాల విషయాలను పర్యవేక్షించే రితికా సూరి గత ఆర్థిక సంవత్సరంలో రూ. 5.1 కోట్ల జీతం పొందారు. ఇజ్రాయెల్ ఆటోమేషన్ కంపెనీ పనాయాను స్వాధీనం చేసుకోవడంలో ఈమె కీలక పాత్ర పోషించారు. రితికా సూరి రాజీనామా విషయాన్ని కంపెనీ ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది.