: వైఎస్ జీవించి ఉంటే ఎస్ఎల్బీసీ పూర్తయ్యేది: షర్మిల


మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉంటే నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ బాధితుల కష్టాలు తీర్చే ఎస్.ఎల్.బి.సి సొరంగ మార్గాన్ని పూర్తి చేసి ఉండేవారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత షర్మిల అన్నారు. 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్రలో భాగంగా ఆమె నల్గొండ జిల్లా చండూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాజశేఖరరెడ్డి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులను ప్రస్తుత కిరణ్ సర్కారు నత్త నడకన జరుపుతోందని ఆరోపించారు. 

వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంతో రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు కూడా ఆగిపోయాయని
ఆమె విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో పేదలకు 47 లక్షల ఇళ్లు కట్టించారని, 2004 నుంచి 2009 సంవత్సరం మధ్యకాలంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదని ఆమె గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పన్నుల ధరలు పెంచుతూ ప్రజల మీద అధిక భారం మోపుతోందని ఆమె విమర్శించారు.

  • Loading...

More Telugu News