: బిట్స్ పిలానీ విద్యార్థికి జపాన్ సాఫ్ట్ వేర్ కంపెనీ రూ.60 లక్షల ఆఫర్


బిట్స్ పిలానీ విద్యార్థి ఒకరు జపాన్ కంపెనీ నుంచి భారీ వేతన ప్యాకేజీతో కూడిన జాబ్ ఆఫర్ అందుకున్నారు. టోక్యోకు చెందిన వర్క్స్ అప్లికేషన్ అనే సంస్థ ఈ ఆఫర్ చేసింది. ఆ తర్వాత జపాన్ కే చెందిన డైకిన్ కంపెనీ మరో విద్యార్థికి 59.5 లక్షల రూపాయల వేతన ఆఫర్ ను ప్రకటించడం విశేషం. అలాగే, క్యాలిఫోర్నియాకు చెందిన శాన్ జోస్ రూ.35 లక్షలు, ష్లుమ్ బెర్జర్ రూ.32 లక్షలు, ఆర్సెసియమ్ రూ.29.5 లక్షలు, డీఈ షా రూ.28.5 లక్షలు, అమేజాన్ రూ.27 లక్షలు, డైరెక్టి రూ.26.8 లక్షల వేతనంతో బిట్స్ పిలానీ యూనివర్సిటీ ఈ ఏడాది నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో మరికొందరికి ఆఫర్లు ఇచ్చాయి. బిట్స్ పిలానీకి హైదరాబాద్, గోవా, పిలానీలో మూడు క్యాంపస్ లు ఉన్నాయి. అమేజాన్, క్యాప్ జెమిని, క్వాల్ కామ్, ఓరాకిల్, మైక్రోసాఫ్ట్ సంస్థలు ఒక్కోటీ ముప్పైకి పైగా ఆఫర్లు ప్రకటించాయి.

  • Loading...

More Telugu News