: అందుకే జ‌గ‌న్ ఛాంబ‌ర్‌లో వాట‌ర్ లీకేజీ చేశామ‌ని చెప్పుకుంటారేమో!: రోజా వ్యంగ్యం


ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌పంచ స్థాయి రాజ‌ధాని అంటూ గొప్ప‌లు చెప్పుకుంటున్నార‌ని, కానీ ప్ర‌జలు అతి ముఖ్య‌మైన అసెంబ్లీ భ‌వ‌నంలో ప్ర‌పంచ స్థాయి బీట‌లు చూస్తున్నార‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. కొత్త‌గా నిర్మించిన అసెంబ్లీ భ‌వ‌నంలో వాట‌ర్ లీకేజీకి రాష్ట్ర ప్ర‌భుత్వం కొత్త కార‌ణాలు చెప్పుకుంటోంద‌ని అన్నారు. చ‌ల్ల‌గా ఉండ‌డానికే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఛాంబ‌ర్‌లో వాట‌ర్ లీకేజీ చేశామ‌ని కూడా చెప్పుకుంటారేమోన‌ని రోజా చుర‌క‌లంటించారు. చిన్న వ‌ర్షానికే ఇంత‌టి క‌ష్టాలు వ‌స్తున్నాయ‌ని అన్నారు.

భూమా నాగిరెడ్డి మృతితో ఖాళీ అయిన నంద్యాల నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ఎన్నిక‌లు వ‌చ్చాయ‌ని, అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి లాక్కున్న వారితో రాజీనామా చేయించి ఆయా స్థానాల్లో కూడా ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని రోజా డిమాండ్ చేశారు. రాష్ట్ర సమస్యలపై పోరాడుతున్న జగన్ వెనుకే ప్రజలు ఉన్నారని వ్యాఖ్యానించారు. 

  • Loading...

More Telugu News