: కర్ణాటకకు ప్రత్యేక రాష్ట్ర పతాకం?... సాధ్యాసాధ్యాలపై కమిటీ విధించిన రాష్ట్ర ప్రభుత్వం!
తమ రాష్ట్రానికి ప్రత్యేకంగా జెండాను రూపొందించుకునే విషయంలో సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి కర్ణాటక ప్రభుత్వం కమిటీని నియమించింది. ఒకవేళ సాధ్యమే అయితే పతాకం డిజైన్‌కు సంబంధించిన సలహాలు కూడా ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. చట్టపరంగా ఇది సాధ్యమే అని తేలితే దేశంలో ప్రత్యేక జెండా గల రెండో రాష్ట్రంగా కర్ణాటక నిలుస్తుంది. ఇప్పటికే భారత రాజ్యాంగంలో ప్రకరణ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక పతాకం ఉంది. గతంలో కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నపుడు కాంగ్రెస్ వారు తమ రాష్ట్రానికి ఎరుపు, పసుపు రంగుల్లో కన్నడిగుల ఖ్యాతిని తెలిపే ప్రత్యేక పతాకం ఉండాలని అసెంబ్లీలో ప్రతిపాదించారు. అలా ఉండటం రాజ్యాంగ పీఠికలోని దేశ ఏకత్వానికి, సమగ్రతకు విరుద్ధమని బీజేపీ ప్రభుత్వం తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.