: ఆధార్ పై తొమ్మిది మంది జడ్జిలతో రాజ్యాంగ ధర్మాసనం... రేపటి నుంచి విచారణ
పాన్ (పర్మెనెంట్ ఎకౌంట్ నెంబర్)తో ఆధార్ నంబర్ అనుసంధానం చేసుకోవాలంటూ కేంద్రం విధించిన నిబంధన వ్యక్తుల గోప్యతకు భంగకరమా? కాదా? అన్నది తేల్చేందుకు తొమ్మిది మంది జడ్జిలతో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఈ రోజు నిర్ణయం తీసుకుంది. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 139 కింద ఆధార్ ను 'పాన్'తో అనుసంధానం చేయాలని నిర్దేశించడం పౌరుల హక్కులను కాలరాయడమేనన్న విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. దీంతో ఆధార్-పాన్ లింకింగ్ వ్యక్తుల గోప్యత హక్కుకు వ్యతిరేకమా? కాదా? గోప్యత ప్రాథమిక హక్కా? కాదా? అన్నది రాజ్యంగ ధర్మాసనం తేల్చనుంది. దీనిపై రేపు విచారణ మొదలవుతుంది. రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశంపై తీర్పు వెలువరించే వరకూ కేంద్రం తీసుకొచ్చిన ఆధార్-పాన్ అనుసంధానంపై కోర్టు స్టే విధించింది.