: చంద్రబాబు నాయుడి నవనాడులు చిట్లిపోయాయి: రోజా ఎద్దేవా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే చేస్తామంటూ ప్రకటించిన నవరత్నాల వల్ల చంద్రబాబు నాయుడి నవనాడులు చిట్లిపోయాయని ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. జగన్ ప్రకటించిన ఆ తొమ్మిది అంశాల ప్రభావంగానే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. మహిళలకు నచ్చజెప్పుకోవాలని ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతిపక్షమేలేదని మాటలు మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు తాము ప్రజల పక్షాన చేస్తోన్న పోరాటంతో భయపడుతున్నారని అన్నారు. దేశంలోనే ఏ ప్రతిపక్ష నాయకుడు చేయలేని విధంగా జగన్ పోరాడుతున్నారని అన్నారు.