: డ్రగ్స్ కేసు నడుస్తున్న వేళ కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం... 219 మంది ఎక్సైజ్ అధికారుల బదిలీ
తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు వెలుగులోకి తెచ్చిన మత్తు మందుల వ్యాపారంలో విచారణ కీలక దశకు చేరుకుని, తెలుగు సినీ ప్రముఖులను ప్రశ్నించడానికి సమయం ఆసన్నమైన వేళ, కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 219 మంది ఎక్సైజ్ అధికారులను బదిలీ చేస్తున్నట్టు ఈ ఉదయం ఉత్తర్వులు వెలువరించింది. 23 మంది అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ లు, 196 మంది ఇన్ స్పెక్టర్లను బదిలీ చేస్తూ జీవో విడుదలైంది. వీరిలో అత్యధికులు డ్రగ్స్ కేసులో భాగంగా విచారణ జరుపుతున్న వారేనని సమాచారం. వీరిలో పలువురిని శాంతి భద్రతలు, ట్రాఫిక్ వంటి విభాగాలకు ట్రాన్స్ ఫర్ చేసినట్టు తెలుస్తోంది.