: భారత్ తో తీవ్ర స్థాయి ఘర్షణకు సిద్ధమే... చైనా మీడియా హెచ్చరిక


మరోసారి చైనా మీడియా భారత్ పట్ల దుందుడుకుగా వ్యవహరించింది. సిక్కిం రాష్ట్ర సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతమైన డోక్లామ్ లో భారత బలగాలు తిష్ట వేసుకుని కూర్చోవడంపై ఇరు దేశాల మధ్య ఘర్షణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై చైనా అధికారిక వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్ ఈ రోజు భారత్ ను హెచ్చరిస్తూ కథనాన్ని ప్రచురించింది. భారత్ తో యుద్ధానికి చైనా భయపడబోదని, తీవ్ర స్థాయి ఘర్షణకూ సిద్ధమేనని అందులో పేర్కొంది. అంతేకాదు, భారత్ తో ఉన్న 3,488 కిలోమీటర్ల  సరిహద్దు పొడవునా వివాదం మొదలవుతుందని హెచ్చరించింది.  టిబెట్ పర్వత ప్రాంతాల్లో చైనా బలగాలు సైనిక విన్యాసాలు చేస్తున్న క్రమంలో గ్లోబల్ టైమ్స్ ఈ కథనం ప్రచురించడం గమనార్హం. 

  • Loading...

More Telugu News