: అస్సాం వరద బాధితుల చేయూతకు రామ్‌చరణ్ విజ్ఞప్తి
ఈశాన్య ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా అస్సాం జలమయమైంది. వరదల కారణంగా ఇప్పటికే 80 మంది చనిపోయారు. అలాగే కజిరంగా జాతీయ పార్కులో నీరు చేరడం వల్ల వన్యమృగాలు మునిగిపోతున్నాయి. వారి సహాయం కోసం ఆన్‌లైన్‌లో ఫండ్స్ వసూలు చేస్తున్న సామాజిక కార్యకర్త వివరాలను హీరో రామ్ చరణ్ ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. అస్సాం వరద బాధితులకు తమ వంతు సహాయం చేయాలంటూ ఆయన అభిమానులను కోరారు. `మీరు అందించే ప్రతి రూపాయి అస్సాం రాష్ట్రాన్ని తన కాళ్ల మీద నిలబడేలా చేస్తుంది` అంటూ ఆయన ఫేస్‌బుక్‌లో రాశారు. మరోవైపు ఈ ఆన్‌లైన్ ఫండ్స్ ద్వారా సామాజిక కార్యకర్త సిమ్రన్‌కు దాదాపు రూ. 2 లక్షల వరకు సమకూరినట్లు తెలుస్తోంది.