: పీవోకే భారత్ లో అంతర్భాగం... అక్కడి వారు భారత్ వచ్చేందుకు పాక్ అనుమతి అక్కర్లేదు: సుష్మాస్వరాజ్


పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్ లో అంతర్భాగమని, దీన్ని పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించుకుందని విదేశాంగ శాఖా మంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. భారత్ లో చికిత్స కోసం రావాలనుకున్న పాక్ ఆక్రమిత కశ్మీర్ వ్యక్తికి వీసా ఇవ్వడాన్ని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ సమర్థించుకున్నారు. పీవోకే వ్యక్తి ఓసామా అలీ లివర్ మార్పిడి చికిత్స కోసం ఢిల్లీకి రావాలనుకుని పాక్ విదేశాంగ శాఖకు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ, అతడి వీసాకు సిఫారసు చేస్తూ భారత హైకమిషన్ కు లేఖ రాసేందుకు పాక్ విదేశాంగ సలహాదారుడు సర్తాజ్ అజీజ్ నిరాకరించారు. అయినా, తాము వీసా జారీ చేస్తామని సుష్మాస్వరాజ్ స్పష్టం చేశారు. పీవోకే భారత్ లో భాగమేనని, అక్కడి వారికి వీసా ఇచ్చేందుకు పాకిస్థాన్ లెటర్ అవసరం లేదంటూ ట్విట్టర్ లో తన స్పందనను పోస్ట్ చేశారు.


  • Loading...

More Telugu News