: బాలగంగాధర్ తిలక్ ముని మనవడిపై అత్యాచార కేసు!


ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు బాలగంగాధర్ తిలక్ ముని మనవడు, కాంగ్రెస్ నాయకుడైన రోహిత్ తిలక్ అత్యాచార కేసులో ఇరుక్కున్నారు. ఓ మహిళపై అత్యాచారం, అసహజ శృంగారానికి ఒత్తిడి చేయడం తదితర ఆరోపణల కింద తిలక్ పై పుణె పోలీసులు సోమవారం రాత్రి కేసు నమోదు చేశారు. దర్యాప్తు అధికారి వెల్లడించిన సమాచారం మేరకు... రోహిత్ తిలక్, 40 ఏళ్ల బాధిత మహిళకు మధ్య కొన్నేళ్ల నుంచి పరిచయం ఉంది. దీంతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి రోహిత్ తిలక్ తనపై ఎన్నో సార్లు అత్యాచారం చేసినట్టు ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఐపీసీలోని పలు సెక్షన్ల కింద రోహిత్ తిలక్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీనియర్ కాంగ్రెస్ నేత అయిన జయంత్ రావు తిలక్ కుమారుడే రోహిత్ తిలక్.

  • Loading...

More Telugu News