: 'రాజుగారి గది 2' కోసం శీరత్ కపూర్ డబ్బింగ్!
తెలుగు తెరపై కథానాయికల పోటీ ఎక్కువగా వుంది. ఇక్కడ నిలదొక్కుకోవాలంటే తెలుగును తప్పనిసరిగా నేర్చుకోవలసిన అవసరం ఏర్పడింది. తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పుకోగలిగిన వాళ్లకి ప్రాధాన్యత ఎక్కువగానే వుంటోంది. దాంతో చాలా మంది కథానాయికలు తెలుగు నేర్చుకుని .. తమ పాత్రకి తామే డబ్బింగ్ చెప్పుకోవడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు.
రీసెంట్ గా సాయిపల్లవి తెలుగు నేర్చేసుకుని 'ఫిదా'లో తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుని శెభాష్ అనిపించుకుంది. ఇప్పుడదే బాటలో శీరత్ కపూర్ వెళుతోంది. గతంలో 'రన్ రాజా రన్' .. 'టైగర్' సినిమాలు చేసిన ఈ సుందరి, ప్రస్తుతం 'రాజుగారి గది 2' చేస్తోంది. ఈ సినిమాలో తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంటున్నట్టుగా చెప్పింది. ఈ సినిమాలోని పాత్ర తనకెంతగానో నచ్చిందని అంది. రవితేజ సరసన ఈ అమ్మాయి 'టచ్ చేసి చూడు' సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.