: మందు కొట్టి టీవీ షోలో హంగామా చేసిన సినీ నటి ఊర్వశి... తన కాపురం కూలిపోయిందని పోలీసులకు యువతి ఫిర్యాదు!
ఓ మలయాళ టెలివిజన్ చానల్ లో తాను వ్యాఖ్యాతగా ఉన్న ఓ షోకు మద్యం తాగి వచ్చిన నటి ఊర్వశి చేసిన వ్యాఖ్యలతో తన భర్తతో విభేదాలు పెరిగి, కాపురం కూలిపోయేలా ఉందని ఆరోపిస్తూ, ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఫ్యామిలీలలో ఏర్పడే తగాదాలను పరిష్కరించే టీవీ రియాల్టీ షోను నటి ఊర్వశి నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి విభేదాలతో సతమతమవుతున్న ఓ జంట రాగా, వారి మధ్య గొడవలను తగ్గించాల్సింది పోయి, నోటికి వచ్చినట్టు ఊర్వశి మాట్లాడినట్టు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఇక ఊర్వశిపై గతంలోనూ ఇటువంటి ఆరోపణలే వచ్చిన సంగతి తెలిసిందే. కుటుంబ కలహాలతో తాగుడుకు బానిసగా మారిన ఆమె, ఇలా పబ్లిక్ గా వివాదాల్లో చిక్కుకునేలా ప్రవర్తిస్తోందని పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.