: వైకాపా ఎంపీ మేకపాటి, ఎమ్మెల్యే గౌతమ్ రెడ్డిలను అరెస్టు చేయాలని వారెంట్లు జారీ


సుమారు ఐదేళ్ల నాడు నమోదైన ఓ కేసులో వైకాపా పార్లమెంట్ సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆత్మకూరు శాసనసభ్యుడు గౌతమ్ రెడ్డి, మేకపాటి రాజగోపాల్ రెడ్డిలను అరెస్ట్ చేయాలని నెల్లూరు కోర్టు వారెంట్లను జారీ చేసింది. 2012లో సనత్ రెడ్డి అనే కాంట్రాక్టర్, మేకపాటి కుటుంబ సభ్యులపై చీటింగ్ కేసు పెట్టారు. తనకు చెల్లించాల్సిన రూ. 2 కోట్లను వారు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ కోర్టులో సాగుతుండగా, పదే పదే వీరంతా కోర్టుకు గైర్హాజరు అయ్యారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరు పరచాలని న్యాయమూర్తి ఆదేశించారు.

  • Loading...

More Telugu News