: సల్మాన్ ఖాన్ బిల్డింగ్.... అద్దె నెలకు రూ. 80 లక్షలు
ముంబైలోని బాంద్రాలో లింకింగ్ రోడ్ వద్ద ఉన్న బిల్డింగ్‌ను ఫ్యూచర్ గ్రూప్ వారి ఫుడ్ కాంప్లెక్స్ కోసం బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అద్దెకు ఇచ్చారు. ఐదు సంవత్సరాల కాలానికి నెలకు రూ. 80 లక్షల అద్దెతో 2,140 చ.మీ.ల భవనాన్ని వారికి అద్దెకు ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారు. సల్మాన్ తరఫున ఆయన తండ్రి సలీం ఖాన్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఇప్పటికే ఈ ఒప్పందానికి సంబంధించి రూ. 2.4 కోట్లు సల్మాన్ ఖాన్‌కు చెల్లించినట్లు సమాచారం.
ఈ బిల్డింగ్‌లోని మూడు ఫ్లోర్లలో ఫుడ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు ఫ్యూచర్ గ్రూప్ తెలిపింది. గతంలో 16 ఫ్లాట్లతో ఉన్న ఈ స్థలాన్ని 2012లో రూ. 120 కోట్లు చెల్లించి సల్మాన్ కొనుక్కున్నారు. 2013-14లో ఇక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేందుకు సల్మాన్ పనులు ప్రారంభించారు. 2017 కల్లా దాని నిర్మాణంతో పాటు అన్ని అనుమతులు తీసుకోవడం పూర్తయింది. ఈ బిల్డింగ్‌కు సంబంధించి అన్ని దస్త్రాలు సల్మాన్ పేరు మీదే ఉన్నాయి.