: అయ్యో! ఎంతపని అయిపోయింది.. తెగబాధపడిపోతున్న ‘ఇన్ఫోసిస్’ నారాయణమూర్తి!
‘ఇన్ఫోసిస్’ నారాయణమూర్తి ఇప్పుడు తెగ బాధపడిపోతున్నారు. చైర్మన్ పదవి నుంచి అనవసరంగా తప్పుకున్నానంటూ పశ్చాత్తాపపడుతున్నారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడైన ఆయన 2014లో చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. అలా చేసినందుకు ఇప్పుడు విచారం వ్యక్తం చేస్తున్నారు. సహ వ్యవస్థాపకుల మాట విని ఆ పదవిలో కొనసాగి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు.
కంపెనీ వీడొద్దని, మరికొన్నేళ్లు ఆగాలని సహచరులు తనకు నచ్చజెప్పారని, అయినా తాను వినిపించుకోలేదని ఓ జాతీయ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆదర్శ భావాల అనుగుణంగానే తన నిర్ణయాలు ఉంటాయన్న ఆయన చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నా ఇన్ఫోసిస్‌కు మాత్రం వెళ్లకుండా ఉండలేదన్నారు. మూడు దశాబ్దాల క్రితం మరో ఆరుగురితో కలిసి నారాయణ మూర్తి ఇన్ఫోసిస్‌ను ప్రారంభించారు. 21 ఏళ్లపాటు సీఈవోగా కొనసాగిన ఆయన 2014లో పదవి నుంచి వైదొలిగారు. ప్రస్తుతం విశాల్ సిక్కా ఆ పదవిలో కొనసాగుతున్నారు.