: ఇకపై ప్రధాని మోదీకి పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలకొద్దు: హోం మంత్రిత్వ శాఖ


ఇకపై ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికే సమయంలో పుష్పగుచ్ఛం ఇవ్వొద్దంటూ హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. దేశంలో ఎక్కడ పర్యటించినా మోదీకి స్వాగతం పలికే సందర్భాల్లో పుష్పగుచ్ఛాలు ఇవ్వొద్దని, దానికి బదులుగా ఖాదీ చేతి రుమాలు లేదా ఓ పుస్తకం ఇవ్వాలని ఆ ప్రకటనలో కోరింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలను జారీ చేసింది. కాగా, గతంలో జరిగిన ఓ బహిరంగ సభలో కూడా ప్రధాని మోదీ ఈ మేరకు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News