: వెంకయ్య నాయుడికి అన్ని పార్టీల మద్దతు లభిస్తుంది: హరీశ్ రావు, కేటీఆర్ హర్షం


ఎన్డీఏ త‌మ ఉప‌ రాష్ట్రపతి అభ్య‌ర్థిగా తెలుగు వ్యక్తి వెంక‌య్య నాయుడి పేరును ప్రకటించడం పట్ల తెలంగాణ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వెంకయ్య నాయుడికి శుభాకాంక్ష‌లు తెలుపుతున్న‌ట్లు హ‌రీశ్ రావు పేర్కొన్నారు. ఓ తెలుగు వ్య‌క్తికి ఈ అవ‌కాశం ఇవ్వ‌డం సంతోష‌క‌ర‌మ‌ని పేర్కొన్నారు. పార్టీల‌కు అతీతంగా వెంక‌య్య నాయుడికి మ‌ద్ద‌తు తెలిపే అవ‌కాశం ఉంటుంద‌ని చెప్పారు. ఆయ‌న‌కు మ‌ద్ద‌తు తెలిపే అంశంలో టీఆర్ఎస్ పార్టీ చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని తెలిపారు. మరోపక్క, వెంక‌య్య నాయుడికి శుభాకాంక్ష‌లు తెలుపుతున్న‌ట్లు కేటీఆర్ పేర్కొన్నారు. వెంక‌య్య నాయుడికి ప‌లువురు నేత‌లు పార్టీల‌కు అతీతంగా శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. రేపు ఉద‌యం 11 గంట‌ల‌కు వెంక‌య్య నాయుడు ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా నామినేష‌న్ వేయ‌నున్నారు.          

  • Loading...

More Telugu News