: వెంకయ్యనాయుడిని ఎంపిక చేయడం చాలా సంతోషం: విష్ణుకుమార్ రాజు


ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడిని ఎంపిక చేయడం చాలా సంతోషమని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, బీజేపీలో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఆయన ఎదిగారని, ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గరకు వెళ్లి చెప్పుకునేవాళ్లమని అన్నారు. ముఖ్యంగా, ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ అంటే వెంకయ్యనాయుడు, వెంకయ్యనాయుడు అంటే బీజేపీ అని అన్నారు.

ఇటువంటి పరిస్థితి నుంచి ఆయన దూరమవుతున్నారని, ప్రత్యక్ష రాజకీయాల్లో, పార్టీ సమావేశాల్లో ఆయన పాల్గొనడం ఇకపై ఉండదని, తమకు ఆయన సలహాలు, సహకారం ఏదైనా కావాలంటే కొంత అవరోధం ఉండే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఏదేమైనప్పటికీ, ఒక తెలుగువారిగా ఆయన ఉపరాష్ట్రపతి పదవిని సొంతం చేసుకోవడమనేది ఆనందించదగిన విషయమని చెప్పారు.

  • Loading...

More Telugu News