: తెలంగాణ సీఎం కేసీఆర్ కి ప్రధాని మోదీ ఫోన్
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎం.వెంకయ్యనాయుడు పేరును భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య పేరును ఖరారు చేశామని తెలిపిన మోదీ.. తమకు మద్దతు ఇవ్వాలని కేసీఆర్‌ని కోరారు. అయితే, దీనిపై స్పందించిన కేసీఆర్ తాము మద్దతు ఇచ్చే అంశంపై రేపు ఓ ప్రకటన చేస్తామని తెలిపారు. వెంకయ్యను ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్, ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేస్తూ.. ఆ పదవికి వెంకయ్యనాయుడు తగిన వ్యక్తని పేర్కొన్నారు.