: ఏఎన్ఎల్ పార్శిల్ అధినేత కృష్ణారావు మృతి!
విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు కుటుంబంలో విషాదం నెలకొంది. ఎఎన్ఎల్ పార్శిల్ అధినేత, అశోక్ గజపతిరాజు తోడల్లుడు సిహెచ్ ఎన్వీ కృష్ణారావు గుండెపోటుతో హైదరాబాద్ లో మృతి చెందారు. దీంతో, కృష్ణారావు స్వస్థలం ఇటిక్యాలలో విషాద ఛాయలు అలముకున్నాయి. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.