: ఏపీలో లైట్ మెట్రోరైల్!: కేబినేట్ నిర్ణయం
ఏపీలో లైట్ మెట్రో రైల్ ను అందుబాటులోకి తీసుకురావాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ఏపీలో మెట్రోరైల్ పై సీఎం చంద్రబాబు ఈ రోజు సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రి నారాయణ, ‘మెట్రో’ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, లైట్ మెట్రో రైల్ ను తీసుకు వచ్చేందుకు చూస్తున్నామని, జర్మనీ సహకారంతో ఈ విషయమై అధ్యయనం చేస్తున్నట్టు చెప్పారు. రెండు బోగీలతో నడిచే ఈ లైట్ మెట్రో రైల్ లో 400 నుంచి 450 మంది ప్రయాణించే సౌకర్యం ఉంటుందని, నిర్మాణ వ్యయం, నిర్వహణ ఖర్చు తగ్గుతుందని, 20 రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామని నారాయణ చెప్పారు.