: 19న విచారణకు రావాలంటూ డ్రగ్స్ కేసులో పూరీ జగన్నాథ్‌కి నోటీసులు జారీ!
టాలీవుడ్‌లో అలజడి రేపుతున్న డ్రగ్స్ కేసులో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులకి ఎక్సైజ్ కార్యాలయం నుంచి నోటీసులు అందిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్శకుడు పూరీ జగన్నాథ్ కి కూడా ఈ రోజు ఎక్సైజ్ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 19న పూరీ జగన్నాథ్ విచారణకు హాజరు కావాల్సిందేనని అందులో పేర్కొన్నారు. ఈ కేసులో నోటీసులు జారీ అయిన వారిని ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ నెల 19 నుంచి రోజుకు ఒకరి చొప్పున విచారించనుంది. తొలిరోజునే పూరీ జగన్నాథ్‌ను విచారిస్తున్నట్లు సిట్ అధికారులు తెలిపారు.