: ముంబయి విమానాశ్రయంలో లష్కరే తోయిబా అనుమానిత ఉగ్రవాది అరెస్టు
ముంబయి విమానాశ్రయంలో ఈ రోజు సాయంత్రం అలజడి చెలరేగింది. ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఓ అనుమానిత ఉగ్రవాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన అనుమానితుడు ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్‌కి చెందిన సలీంఖాన్ అని పోలీసులు పేర్కొన్నారు. సలీంఖాన్‌ను లష్కరే తోయిబా ఉగ్రవాదిగా అనుమానిస్తున్నట్లు, అతనిని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.