: 10 వేల మార్క్ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న నిఫ్టీ
భారతీయ స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు కొనసాగుతోంది. ఈ ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు, అదే జోరు కొనసాగిస్తూ చివరకు లాభాల్లో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 54 పాయింట్ల లాభంతో 32,075కు పెరిగింది. నిఫ్టీ 30 పాయింట్లు లాభపడి 9,916 వద్ద క్లోజ్ అయింది. 10వేల మార్కును చేరుకోవడానికి నిఫ్టీ వడివడిగా అడుగులు వేస్తోంది.
రుతుపవనాలు ఆశావహంగా ఉండటం, తొలి త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు సానుకూల దృక్షథంతో వ్యవహరిస్తున్నారు. దీంతో, మార్కెట్లలో జోష్ కనిపిస్తోంది. ఈ నాటి ట్రేడింగ్ లో వేదాంత, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్సీఎల్ టెక్, జీ ఎంటర్ టైన్ మెంట్ తదితర షేర్లు లాభపడగా... యస్ బ్యాంక్, కోల్ ఇండియా, ఐటీసీ, గెయిల్, యాక్సిస్ బ్యాంక్ తదితర షేర్లు నష్టాల బాటలో పయనించాయి.