: విచిత్రం... ఆవుల కిడ్నీలు చోరీ చేస్తున్న ముఠా!


కర్ణాటకలో విచిత్ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఆవుల కిడ్నీలను చోరీ చేస్తున్నారు. రాష్ట్రంలోని హవేరి జిల్లాలోని సావనూర్ గ్రామంలో అర్ధ‌రాత్రి పూట ఆవుల అరుపులు విన్న య‌ల్ల‌ప్ప‌ అనే వ్య‌క్తి బ‌య‌ట‌కు వ‌చ్చి చూడ‌గా కొంద‌రు దుండ‌గులు త‌న‌ ఆవుల‌ శ‌రీర భాగాన్ని కోస్తూ క‌నిపించారు. ఆయ‌న‌ను చూడ‌గానే అక్క‌డి నుంచి దుండ‌గులు పారిపోయారు. తీవ్ర ర‌క్త‌స్రావంతో రెండు ఆవులు ప్రాణాలు కోల్పోయాయి. ఈ ఘ‌ట‌న‌పై ఆయ‌న పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.

స‌ద‌రు దుండ‌గులు ఒక ఆవు కిడ్నీని తొలగించి, మరొక ఆవు కిడ్నీని బయటికి తీస్తుండగా య‌ల్ల‌ప్ప బ‌య‌ట‌కు వ‌చ్చాడ‌ని, దీంతో ఆ ఒక్క కిడ్నీతో దుండ‌గులు పారిపోయార‌ని పోలీసులు తెలిపారు. ఆవుల కిడ్నీల‌ను దొంగిలించి ఆ వ్య‌క్తులు ఏం చేస్తార‌న్న అంశం ఆస‌క్తిగా మారింది. ఇటువంటి కేసులు రాష్ట్రంలో ఇంకా ఎక్కడైనా నమోదయ్యాయా? అనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డ నిందితుల కోసం గాలింపు చ‌ర్య‌లు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News