: బ్యాలెట్ పేపర్ బయటకు తెచ్చి, ఓటు ఎక్కడ వేయాలని అడిగిన ఎమ్మెల్యే.. క్లాస్ పీకిన హరీష్ రావు!


ఏపీ, తెలంగాణల్లో రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. పోలింగ్ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఓటు వేయడానికి పోలింగ్ బూత్ లోకి వెళ్లిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బ్యాలెట్ పేపరు పట్టుకుని బూత్ నుంచి బయటకు వచ్చారు. ఓటు ఎక్కడ వేయాలంటూ అడిగారు.

 దీంతో, పక్కనే ఉన్న మంత్రి హరీష్ రావు ఆయనను దగ్గరకి పిలిచి క్లాస్ పీకారు. ఓటు ఎలా వేయాలో ఇంతకుముందే చెప్పినప్పటికీ... ఇదేంటని హరీష్ మండిపడ్డారు. ఈ సందర్భంగా వివరణ ఇచ్చేందుకు ముత్తిరెడ్డి ప్రయత్నించగా... తనకేం వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని, నేరుగా ముఖ్యమంత్రికే వివరణ ఇవ్వాలని కోపంగా చెప్పారు. మరి ఈ ఘటనపై కేసీఆర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

  • Loading...

More Telugu News