: ఎమ్మెల్యే రోజాకు మరోసారి కష్టాలు.. నోటీసులు ఇవ్వాలని ఆదేశించిన అసెంబ్లీ స్పీకర్ కోడెల


రాష్ట్రపతి ఎన్నికల‌ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్య‌లు అల‌జ‌డి రేపాయి. ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ.. ఓటుహక్కు వినియోగించుకునేందుకు అసెంబ్లీ ప్రాంగణానికి వెళ్లిన ఆమె ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివ‌ప్రసాద్‌పై ప‌లు వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి మాక్ ఓటింగ్‌ నిర్వహించడం సరికాదని ఆమె అన్నారు. అలాగే స్పీకర్ కూడా అందుకు సహకరించారని ఆరోపించారు.

 నిబంధ‌న‌లకు విరుద్ధంగా రోజా ఆ ప్రాంతంలో రాజ‌కీయ వ్యాఖ్య‌లు చేయ‌డం ప‌ట్ల స్పందించిన స్పీక‌ర్‌ కోడెల‌.. రోజాకు నోటీసులు ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించారు. దీంతో రోజా మ‌రోసారి చిక్కుల్లో పడ్డారు. గ‌తంలో శాస‌న‌స‌భ‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు కూడా ఆమెకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు అందడంతో పెద్ద వివాద‌ం చెల‌రేగిన విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News