: తెలంగాణలో ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్.. ఓటు వేయని ఇద్దరు ఎమ్మెల్యేలు వీరే!


రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. తెలంగాణలో కాసేపటి క్రితం పోలింగ్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలోని మొత్తం 119 మంది ఎమ్మెల్యేలకు గాను 117 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీఆర్ఎస్ కు చెందిన మనోహర్ రెడ్డి, ఎంఐఎంకు చెందిన అక్బరుద్దీన్ ఒవైసీలు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. అనారోగ్య కారణాలతో వీరిద్దరూ ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. పోలింగ్ సందర్భంగా తొలి ఓటును ముఖ్యమంత్రి కేసీఆర్ వేయగా, ఆ తర్వాత వరుసగా స్పీకర్ మధుసూదనాచారి, సీఎల్పీ నేత జానారెడ్డిలు ఓటు వేశారు. అనంతరం మిగిలిన ఎమ్మెల్యేలంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • Loading...

More Telugu News