: ఐదో తరగతి విద్యార్థిని కొట్టి చంపిన తోటి విద్యార్థులు
ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఉన్న ఓ పాఠశాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఐదో తరగతి విద్యార్థిని తోటి విద్యార్థులు కొట్టి చంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే, ఐదో తరగతి చదువుతున్న విశాల్ (11) కి, తోటి విద్యార్థికి మధ్య గొడవ జరిగి కొట్టుకున్నారు. ఈ క్రమంలో ముగ్గురు విద్యార్థులు విశాల్‌పై దాడి చేశారు. కొద్ది సేపటి తరువాత ఇంటికి చేరుకున్న విశాల్‌కి కడుపులో తీవ్రంగా నొప్పి వచ్చింది. తనను తన స్నేహితులు కొట్టారని ఆ బాలుడు తన తల్లిదండ్రులకు ఏడుస్తూ చెప్పాడు. వెంటనే ఆ బాలుడిని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.