: సముద్ర జలాల్లో విలువైన ఖనిజ నిక్షేపాలు కనుగొన్న భారత్


జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు బంగాళాఖాతంలో కోట్ల టన్నుల మేరకు విలువైన లోహాలు, ఖనిజ నిక్షేపాలను కనుగొన్నారు. మంగళూరు, చెన్నై, మన్నార్ బేసిన్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ చుట్టుపక్కలా ఖనిజాలు ఉండవచ్చని 2014లోనే కనుగొన్న శాస్త్రవేత్తలు, వాటి ఆనవాళ్లను ఇప్పుడు స్పష్టంగా తెలుసుకున్నారు. లైమ్ మడ్, ఫాస్పేట్, హైడ్రోకార్బన్స్, ఫెర్రస్ నిక్షేపాలు ఈ ప్రాంతంలో పుష్కలంగా ఉన్నాయని, వీటిని వెలికితీస్తే, దేశాభివృద్ధికి ఎంతో ఉపకరిస్తాయని తేల్చి చెబుతున్నారు.

మూడేళ్ల పాటు పరిశోధనలు సాగించిన జీఎస్ఐ శాస్త్రవేత్తలు, 1.81 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇవి ఉన్నాయని, ఇండియాకు పూర్తి హక్కులున్న నీటి కిందనే ఉన్నాయని తేల్చారు. సముద్ర రత్నాకర్, సముద్ర కౌస్తుభ్, సముద్ర సౌదికామ నౌకల సాయంతో శాస్త్రవేత్తలు వీటిని గుర్తించారని అధికారులు వెల్లడించారు. చెన్నై, మంగళూరు తీరాల్లో ఫాస్పేట్, మన్నార్ బేసిన్ లో గ్యాస్ హైడ్రేట్, తమిళనాడు తీరానికి దగ్గర్లో కోబాల్ట్, ఫెర్రో మాంగనీస్, లక్షద్వీప్ ప్రాంతంలో మైక్రో మాంగనీస్ ఖనిజాలు ఉన్నాయని వెల్లడించారు. సీబెడ్ మ్యాపింగ్ విధానంలో వీటిని గుర్తించామని జీఎస్ఐ సూపరింటెండెంట్ జియాలజిస్టు ఆశిష్ నాథ్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News