: గుజరాత్‌లోని 50 పురాతన కట్టడాల వద్ద బ్రెయిలీ బోర్డులు
పురాతన కట్టడాల వివరాలను అంధులకు అందుబాటులో ఉంచేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా 50 పురాతన కట్టడాల వద్ద బ్రెయిలీ సంకేత బోర్డులను గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. మోధెరా సూర్యదేవాలయం, పటాన్‌లోని రాణీ కీ వావ్, డయ్యూ కోట, చంపనీర్‌లోని జామా మసీదు వంటి 50 సందర్శన కట్టడాల చరిత్రను, ఖ్యాతిని వివరిస్తూ బ్రెయిలీ లిపిలో బోర్డులను ఏర్పాటుచేయనున్నారు. ఇటీవల యునెస్కో అహ్మదాబాద్ నగరాన్ని వారసత్వ నగరంగా గుర్తించింది. అందుకు తగినట్లుగా అంతర్జాతీయ సందర్శకుల సౌకర్యార్థం గుజరాత్‌లోని సందర్శనీయ కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భాగంగానే బ్రెయిలీ లిపిలో బోర్డులు ఏర్పాటుచేసినట్లు ఆర్కియాలజిస్ట్ అనిల్ తివారీ తెలిపారు.