: సిక్కిం మాజీ ముఖ్యమంత్రి భండారీ కన్నుమూత.. దేశంలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిలో ఒకరిగా కీర్తి!
గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సిక్కిం మాజీ ముఖ్యమంత్రి నర్ బహదూర్ భండారీ (77) ఆదివారం కన్నుమూశారు. ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కార్డియాక్ అరెస్ట్ కారణంగా మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
సిక్కిం సంగ్రామ్ పరిషద్ పార్టీ వ్యవస్థాపకుడు అయిన భండారీ సిక్కింకు ముఖ్యమంత్రిగా పనిచేసిన తొలి గూర్ఖా నాయకుడు కావడం గమనార్హం. 1979 నుంచి 1994 వరకు మూడుసార్లు హిమాలయన్ స్టేట్‌కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన వారిలో భండారీ ఒకరు. సోమవారం అధికారిక లాంఛనాలతో సిక్కింలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.