: భారత్ ఎదుగుదల విషయంలో చైనా సైలెంట్‌గా ఉండాల్సిందే.. చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ సంచలన కథనం


చైనాకు చెందిన అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ సంచలన కథనాన్ని ప్రచురించింది. భారత్ ఎదుగుదల విషయంలో చైనా  సెలెంట్‌గా ఉండాల్సిందేనని పేర్కొంది. భారత్‌కు విదేశీ పెట్టుబడుల వరద కొనసాగుతోందని, దీనివల్ల ఆ దేశంలో తయారీ రంగం గొప్పగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని పేర్కొంది. చైనా సైలెంట్‌ (కీప్ కామ్) గా ఉండి భారత్‌ను అధిగమించేందుకు మరింత కష్టపడి పనిచేయాల్సి ఉంటుందని సూచించింది.

భారత్‌కు వెల్లువెత్తుతున్న విదేశీ పెట్టుబడుల వల్ల ఆ దేశంలో ఆర్థిక వ్యవస్థకు గొప్ప ఊపు వస్తుందని, ఉపాధి అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతాయని తన కథనంలో పేర్కొంది. ‘‘ఈ విషయంలో చైనా నిశ్శబ్దంగా ఉండాల్సిందే. కొత్త శకం కోసం చైనా మరింత సమర్థంగా పనిచేయడం ప్రారంభించాలి, అభివృద్ధి వ్యూహాలు రచించాలి’’ అని చైనా ప్రభుత్వానికి సూచించింది.‘‘భారత్‌లో గతంలో పెట్టుబడుల సమస్య ఉండేది. తయారీ రంగంలో నిపుణులైన కార్మికుల కొరత ఉండేది. ఇప్పుడు విదేశీ పెట్టుబడులు వస్తుండడంతో భారత్‌లో ఇక ఆ సమస్య తీరిపోయినట్టే’’ అని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.

  • Loading...

More Telugu News