: సంపూర్ణేష్‌ బాబు, ముమైత్‌ ఖాన్‌, అర్చన... బిగ్‌ బాస్‌ పార్టిసిపెంట్లు వీరే!


టాలీవుడ్‌ ప్రేక్షకుల్లో ఇటీవలి కాలంలో అత్యంత ఆసక్తిని కలిగించిన జూనియర్‌ ఎన్టీఆర్‌ 'బిగ్‌బాస్‌' రియాలిటీ షో ప్రారంభమైంది. జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రయోక్తగా వ్యవహరిస్తున్న ఈ షోలో పాల్గొనేది ఎవరన్న విషయం తెలిసిపోయింది. యువ హీరో సాయిబాలాజీ, హీరో సంపూర్ణేష్‌ బాబు, క్యారక్టర్‌ ఆర్టిస్ట్ సమీర్‌, హాస్య నటుడు ధన్‌రాజ్‌, హాట్‌ గర్ల్ అర్చన, `ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాయే' అన్న పాటతో పేరు తెచ్చుకున్న సింగర్‌ మధుప్రియ, యాంకర్‌ కత్తి కార్తీక, ఐటెం గాళ్‌ ముమైత్‌ ఖాన్‌ తదితరులున్నారు. 'స్టార్‌ మా' టీవీలో ఈ రాత్రి 9 గంటలకు ప్రారంభమైన షో ఆరంభం అభిమానులను అలరించింది. 

  • Loading...

More Telugu News