: నిజాంపేటలో నెల రోజుల క్రితం అదృశ్యమైన విద్యార్థిని పూర్ణిమ సాయి ఆచూకీ లభ్యం!


గత నెల 7న హైదరాబాద్, నిజాంపేటలో అదృశ్యమైన పదో తరగతి విద్యార్థిని పూర్ణిమ సాయి ఆచూకీ లభ్యమైంది. ముంబైలోని దాదర్ లో పూర్ణిమ సాయి ఉండటాన్ని అక్కడి ఓ స్వచ్ఛంద సంస్థ గుర్తించింది. ఈ విషయాన్ని సైబరాబాద్ పోలీసులకు తెలియజేయడంతో అక్కడికి వెళ్లారు. ముంబై నుంచి ఆమెను హైదరాబాద్ కు తీసుకురానున్నారు. కాగా, నిజాంపేటకు చెందిన పదమూడేళ్ల పూర్ణిమ సాయి స్కూల్‌కని వెళ్లి.. అదృశ్యమైంది.

దీంతో, ఆ బాలిక తల్లిదండ్రులు తమ బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికారు. బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో, బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తొలుత, మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసిన పోలీసులు,ఆ తర్వాత దీనిని కిడ్నాప్‌ కేసుగా మార్చారు.

  • Loading...

More Telugu News