: గంటాకు పొగబెట్టాల్సిన అవసరం నాకేముంది?: అయ్యన్నపాత్రుడు
ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడి మధ్య విభేదాలు ఉన్నట్టు మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, గంటాకు పొగబెట్టాల్సిన అవసరం తనకు లేదని, ఆయనవల్ల తనకు నష్టమేమీ లేదని, ఆయన నియోజకవర్గంలో తాను పోటీ చేయనని, తన నియోజకవర్గంలో ఆయన పోటీ చేయడని అన్నారు. ఆయన మంత్రిగా ఉన్నాడు, తానూ మంత్రిగా ఉన్నానని, తమను చంద్రబాబు ఒకేలా చూస్తున్నారని అన్నారు. అందరం కలిసి పని చేస్తున్నామని, వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబును మళ్లీ సీఎంను చేయాలనే లక్ష్యం పెట్టుకున్నామని అన్నారు.