: కులభూషణ్ కు క్షమాభిక్షను నిరాకరించిన పాక్ మిలిటరీ కోర్టు
గూఢచర్యం ఆరోపణల నేపథ్యంలో భారత నౌకాదళ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ కు పాకిస్థాన్ ఆర్మీ కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ కులభూషణ్ పెట్టుకున్న పిటిషన్ ను పాక్ మిలిటరీ కోర్టు తిరస్కరించినట్టు పాక్ మీడియా సంస్థ పేర్కొంది. కాగా, జాదవ్ కు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ ఆయన తల్లి చేసిన వినతి ఇంకా పరిశీలనలో వుంది. గూఢచర్యం కేసులో ఈ ఏడాది ఏప్రిల్ 10న కులభూషణ్ కు పాక్ సైనిక కోర్టు మరణశిక్ష విధించగా, దీనిని సవాల్ చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని భారత్ ఆశ్రయించడంతో ఈ తీర్పుపై స్టే విధించింది.